ఫుట్‌బాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం.
ఫుట్‌బాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం.
భద్రాచలం సూర్య న్యూస్::
భద్రాచలం ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన '7-ఏ-సైడ్' ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్లో భద్రాచలం జట్టు విజేతగా నిలవగా, డోర్నకల్ జట్టు రన్నరప్‌గా, భద్రాచలం సీఆర్పీఎఫ్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి.విజేతలకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, టీమ్‌వర్క్ పెరుగుతాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం రోజున ఈ టోర్నమెంట్ ఫైనల్స్ జరగడం సంతోషకరమన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.