BREAKING
గ్రీస్‌ వేదికగా ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్, స్టాలిన్ సందడి గ్రామల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు మరికల్‌లో నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి నిబంధనలకు విరుద్ధమైన బాణాసంచా దుకాణాలను మూసివేయాలి యూత్‌ను ఉర్రూతలూగిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ కొత్త సాంగ్.. ‘మిత్వా మిత్వా’ విడుదల కీసరలో మరో ఏసీబీ వల.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ అరెస్ట్ ప్రజావాణికి 32 దరఖాస్తులు ‘రామాయణం’పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రశంసలు.. విమర్శకులకు గట్టి కౌంటర్! నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ‘ఆలోచన’ విడుదల.. వృద్ధాశ్రమంలో వైభవంగా పోస్టర్ ఆవిష్కరణ ఇంచార్జి సబ్‌ రిజిస్ట్రార్‌కు ఘన సన్మానం.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో చాందిని చౌదరి కొత్త సినిమా.. కీలక పాత్రలో నటుడు బాబీ సింహ ఎంట్రీ జపాన్‌లో టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక దీపావళి వేడుకలు.. వైరల్ అవుతున్న ఫొటోలు రామాయణం చిత్ర యూనిట్ సంచలన హెచ్చరిక.. థియేటర్లలో పైరసీ వీడియోలు రికార్డు చేస్తే కఠిన చర్యలు గర్భిణీ స్త్రీలకు .. ఫన్నీ క్లబ్ అన్నదానం ఫేక్ న్యూస్‌పై మండిపడిన ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్.. బాధ్యతారాహిత్యంపై క్లిక్‌బైట్ పోర్టళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్

ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ

సూర్య - మానకొండూర్ : మండలంలోని అన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు, గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు రామగిరి సారయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా అన్నారం గ్రామపంచాయతీ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, మహిళలు డీజే పాటల మధ్య పెద్ద ఎత్తున ర్యాలీగా లబ్ధిదారులైన రామగిరి విజయ- ప్రకాష్ దంపతుల నివాసానికి చేరుకున్నారు. ఇంటి యజమానులు ఎమ్మెల్యేకు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇంట్లో జరిగిన లక్ష్మీ పూజలో పాల్గొని, లబ్ధిదారులైన దంపతులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్, ఎంపీడీఓ, హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. గూడు లేని నిరుపేదలు లేని తెలంగాణను నిర్మించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలలను సాకారం చేసేందుకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం ఈ మండలంలో ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వకుండా నిరుపేదలను వంచించిందని ఎమ్మెల్యే విమర్శించారు. నిరుపేదలకు ఇల్లు, భూమి లేకుంటే వారి జీవితాలు ఎలా మారుతాయని ప్రశ్నించారు. గతంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే నిరుపేదలకు మూడు ఎకరాల భూములతో పాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చారని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలోనూ అదే సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. నూతన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగ జరుపుకుంటున్న లబ్ధిదారుల కుటుంబాలకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మహిళలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.