BREAKING
గ్రీస్‌ వేదికగా ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్, స్టాలిన్ సందడి గ్రామల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు మరికల్‌లో నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి నిబంధనలకు విరుద్ధమైన బాణాసంచా దుకాణాలను మూసివేయాలి యూత్‌ను ఉర్రూతలూగిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ కొత్త సాంగ్.. ‘మిత్వా మిత్వా’ విడుదల కీసరలో మరో ఏసీబీ వల.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ అరెస్ట్ ప్రజావాణికి 32 దరఖాస్తులు ‘రామాయణం’పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రశంసలు.. విమర్శకులకు గట్టి కౌంటర్! నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ‘ఆలోచన’ విడుదల.. వృద్ధాశ్రమంలో వైభవంగా పోస్టర్ ఆవిష్కరణ ఇంచార్జి సబ్‌ రిజిస్ట్రార్‌కు ఘన సన్మానం.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో చాందిని చౌదరి కొత్త సినిమా.. కీలక పాత్రలో నటుడు బాబీ సింహ ఎంట్రీ జపాన్‌లో టాలీవుడ్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక దీపావళి వేడుకలు.. వైరల్ అవుతున్న ఫొటోలు రామాయణం చిత్ర యూనిట్ సంచలన హెచ్చరిక.. థియేటర్లలో పైరసీ వీడియోలు రికార్డు చేస్తే కఠిన చర్యలు గర్భిణీ స్త్రీలకు .. ఫన్నీ క్లబ్ అన్నదానం ఫేక్ న్యూస్‌పై మండిపడిన ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్.. బాధ్యతారాహిత్యంపై క్లిక్‌బైట్ పోర్టళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్

తుఫాను నష్టాల పరిశీలనలో ఎమ్మెల్యే జారె**దెబ్బతిన్న రోడ్లు చెరువులు కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అధికారులకు ఆదేశం*

Select Suryaa Now
తుఫాను నష్టాల పరిశీలనలో ఎమ్మెల్యే జారె**దెబ్బతిన్న రోడ్లు చెరువులు కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అధికారులకు ఆదేశం*

సూర్య దమ్మపేట,దమ్మపేట  మండలం లింగాలపల్లి గ్రామంలో  ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ పర్యటించి ఇటీవల మురసు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రహదారులు చెరువులు వంటకాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు తుఫాను కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి నివేదించి అర్హులైన రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అధికారులు గ్రామాల్లో పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్వహించిన మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మడకం లక్ష్మి  నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు

ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల నాయకులు స్థానిక నాయకులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు

సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట