అశ్వారావుపేటలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్*
సూర్య అశ్వారావుపేట అశ్వారావుపేట మండలం పాకాలగూడెం గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గల 84 ఇళ్ళను తనిఖీ చేయగా, 62 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 ట్రాక్టర్లను తనిఖీ నిర్వహించారు. సరైన రిజిస్ట్రేషన్ ధ్రువ పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా పోక్సో చట్టాలపై అవగాహన కలిగించారు.పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ ఆదేశాలతో జరిగిన ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ పి నాగరాజు రెడ్డి, అశ్వారావుపేట ఎస్ హెచ్ ఓ సాయి కిషోర్ రెడ్డి, అశ్వారావుపేట అదనపు ఎస్సై దేవ్ సింగ్,దమ్మపేట పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట
---
ఫోటోతో కలిపి పేపర్ కటింగ్ లాగా పోస్టర్ చేయాలా?