BREAKING
కొత్త ఇంట్లో అలియా భట్, రణబీర్ కపూర్ దీపావళి సంబరాలు.. చిన్నారి రాహా ముద్దుల హడావుడి జగ్గయ్యపేట కౌంటింగ్ హాల్ వద్ద టీడీపీ శ్రేణుల దాడి.. మంగొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారు ధ్వంసం బొటాక్స్ చికిత్సలకు నేను పూర్తిగా వ్యతిరేకం.. సహజత్వమే నా అందం అంటున్న బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఫుట్‌బాల్ విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం. ఓట్ల గోల్‌మాల్‌పై కోర్టు గర్జన బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సర్‌ప్రైజ్.. ఎలిమినేషన్ లేదంటూ నాగార్జున ప్రకటన నంద్యాలలో ప్రధమ నంది దేవాలయం కార్తీక మాసం కలెక్టర్ కి ఆహ్వానం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ..డా. వి. నరేందర్ రెడ్డి త్వరలోనే ఓటీటీ వేదికగా రణబాలి సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలపై క్రేజీ అప్డేట్ ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ సెన్సార్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన 'భోగి' సినిమా విడుదల తుఫాను నష్టాల పరిశీలనలో ఎమ్మెల్యే జారె**దెబ్బతిన్న రోడ్లు చెరువులు కాలువలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి అధికారులకు ఆదేశం* వరంగల్‌లో బయటపడ్డ బీఆర్‌ఎస్ వర్గ విభేదాలు: పరకాలలో ఫ్లెక్సీల వివాదం అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! కార్యకర్తలపై కాదు... దమ్ముంటే నాపై దాడి చేయండి: అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హెచ్చరిక

అగ్నిప్రమాదాలపై అధికారులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు

Select Suryaa Now
అగ్నిప్రమాదాలపై అధికారులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు

 అమరావతి: దీపావళి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకున్న తీవ్ర అగ్నిప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజాం, గన్నవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదాలపై ఆయన తక్షణమే స్పందించి, సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనల వివరాలను ఆరా తీశారు. రాజాంలో ఒక ఆటోమొబైల్ షోరూమ్‌లో భారీగా మంటలు చెలరేగి షోరూమ్ పూర్తిగా దగ్ధం కాగా, కృష్ణా జిల్లా గన్నవరంలో బాణసంచా కాలుస్తున్న సమయంలో ఎగిసిపడిన నిప్పురవ్వలు పడి ఒక ఫర్నిచర్ దుకాణం తగలబడింది. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మరొక వ్యాపార దుకాణం కాలిభస్మమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ మూడు ప్రమాదాలపై అధికారుల నుంచి సమగ్ర సమాచారం సేకరించిన సీఎం చంద్రబాబు, అగ్నిమాపక మరియు స్థానిక యంత్రాంగం త్వరితగతిన స్పందించి నష్ట తీవ్రతను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, జరిగిన ఆస్తి నష్టంపై వెంటనే నివేదిక సమర్పించాలని, బాధితులకు ప్రభుత్వం తరఫున తగిన సహాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.