BREAKING
ఆధునిక సాగు మెళకువల కోసం.. మెగా రైతు మేళాకు రైతుల పయనం మానకొండూరులో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు అగ్నిప్రమాదాలపై అధికారులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు అనిరుద్ పెళ్లి సందడి ప్రముఖుల హాజరు ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు దక్షిణాసియా పారా త్రోబాల్ పోటీలకు రవిష్ రెడ్డి. :భారతదేశం తరఫున శ్రీలంకలో ప్రాతినిధ్యం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి వేడుకలు... పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణారావు పరిగిలో తీవ్ర ఉద్రిక్తత: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సుల్తాన్‌పూర్‌లో ప్రభుత్వ విప్ విజయరమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థిని ఎంపిక చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద అగ్నిప్రమాదం: దగ్ధమైన పాత రికార్డులు అభివ్రుద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్నాం...కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

Select Suryaa Now
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

•  తపాలాపూర్ చెక్‌పోస్ట్ వద్ద రైతుల రాస్తారోకో.. కడెం నీటిని విడుదల చేయాలని డిమాండ్

సూర్య, జన్నారం: కడెం ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జన్నారం మండలం తపాలాపూర్ చెక్‌పోస్ట్ వద్ద గ్రామ రైతులు రాస్తారోకో చేపట్టారు. సాగునీటిని వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.

కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో కడెం ప్రాజెక్టు నీటిని నిలిపివేయడం తమకు తీవ్ర నష్టం కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యపై అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశానికి రైతే వెన్నెముక అని చెప్పే పాలకులు, అధికారులు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. రాస్తారోకో కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సాగునీటిని వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతులు నైనాల తిరుపతి, కమ్మల విజయ్ ధర్మ, జాడి తిరుపతి, పన్నాల విజయ్, సప్ప చంద్రయ్య, ఏదుల అజయ్, కొమురయ్య, సుశీల తదితరులు పాల్గొన్నారు.