శ్రీ మఠంలో దీపావళి వేడుకలు
మంత్రాలయం, సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన కోవెలలో పీఠాధిపతులు ముందుగా శ్రీ మూలరాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపూజ, తులసి పూజ నిర్వహించిన శ్రీ మఠం పీఠాధిపతి.. దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభు దేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ మూల రామదేవునికి కార్తిక మంగళహారతి, ఘనంగా నిర్వహించారు.. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ఇతర బృందావనాలకు తైలా అభ్యంజనం నిర్వహించారు. పవిత్రమైన నారికృత, నిరాజనం కార్యక్రమం నిర్వహించారు. స్వామీజీ భక్తులకు అనుగ్రహ సందేశం ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు,వెంకటేష్ జోషి ఐ.పీ.నరసింహ స్వామి,వ్యాసరాజాచర్,. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
నాగరాజు, సూర్య ప్రతినిధి మంత్రాలయం కర్నూలు జిల్లా