ఐ.ఎన్.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐ.ఎన్.ఐ. సెట్)లో ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ సోమేపల్లి మార్కండేయులు కుమార్తె సోమేపల్లి నాగ సింధు 5వ ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 62 వేల మంది వైద్యులు ఈ పోటీ పరీక్షలో పోటీ పడగా నాగసింధు ప్రతిభ కనబరిచింది. నాగసింధు గుంటూరు ఎన్నారై అకాడమీలో ఇంటర్ విద్య పూర్తి చేసి ఒరిస్సాలోని భువనేశ్వర్ ఎయిమ్స్ కళాశాలలో ఎం.బీ.బీ.ఎస్ పూర్తి చేసింది. నాగ సింధు సమీప బంధువైన కొచ్చిన్‌లో ఆంకాలజీ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న డాక్టర్ సోమేపల్లి నవీన సూచనల మేరకు తాను ఈ విజయం సాధించామన్నారు. తండ్రి మార్కండేయులు నాగండ్ల గ్రామంలో గతంలో సర్పంచ్‌గా పలు సేవలందించి గ్రామాభివృధ్ధికి కృషి చేశారు. అనంతరం గుంటూరు హైకోర్టులో న్యాయవాదిగా, తల్లి గుంటూరు ఎన్నారై అకాడమీలో అధ్యాపకురాలుగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా నాగ సింధు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తనకు ర్యాంకు రావటం సంతోషకరంగా ఉందని, భవిష్యత్తులో కార్డియాలజీ విభాగంలో మంచి వైద్యురాలుగా సేవలందించాలనే సంకల్పంతో ఉన్నానని తెలిపారు. ఈ విజయం పట్ల తోటి వైద్యులు, పలువురు గ్రామ ప్రముఖులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిభాష, ఇంకొల్లు.