తెలుగుదేశం పార్టీ అరాచకాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మాజీ ఎమ్మెల్యే బియ్యపు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి చేసిన అరాచకాలను రౌడీయిజాన్ని మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను.
మొదటగా నామినేషన్ల సమయంలో అధికారాన్ని అధికారంలో అడ్డం పెట్టుకొని టిడిపి చేసిన అరాచకాలు, రౌడీయిజాలు మీ అందరూ చూశారు వారితో పోరాడి చివరికి తొట్టంబేడు మండలం నుండి 5 ఎంపీటీసీ స్థానాలు 1 జడ్పిటిసి స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది. అలాగే రేణిగుంట నుండి 3 ఎంపీటీసీ స్థానాలకు 1 జడ్పిటిసి స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది మిగిలిన శ్రీకాళహస్తి ఏర్పేడు మండలాల్లో పూర్తిగా మా నామినేషన్ పత్రాలు చించేశారు మా వాహనాలు ధ్వంసం చేశారు మా మనుషులు తలలు పగలగొట్టారు. బయట నుండి మనుషుల్ని తీసుకొచ్చి కర్రలు రాళ్లతో దాడులు చేయించారు.
అలాగే అధికారులను పోలీసులు అడ్డుపెట్టుకొని పోలింగ్ రోజు ఎలా రిగ్గింగ్ చేశారో మీ అందరికీ తెలిసినదే తొట్టంబేడు మండలంలో కొన్నలి,కనపర్తి, సాంబయ్యపాలెం, తొట్టంబేడు, శేషమ్మ నాయుడు కండ్రిగ ఇలాగా ప్రతి గ్రామంలో మా ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసి పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించి రిగ్గింగ్ చేశారు.
అడ్డుకున్న మా మా వాళ్లని పోలీసుల ద్వారా బెదిరించి అరెస్టులు చేయించారు.
తిరుపతి చెన్నై నుండి వందలాది మనుషులను తరలించి దొంగ ఓట్లు వేసి తొట్టంబేడు మండలంలో అరాచకాన్ని సృష్టించారు.
కానీ ఇంత చేసినా కూడా మందు, డబ్బు, అధికారం, పోలీస్, అధికారులు, వీళ్ళందర్నీ పెట్టుకున్నా కూడా మీరు సాధించింది కేవలం 700 ఓట్లు మాత్రమే అవి కూడా బ్యాలెట్ పేపర్లు మార్చేసి గెలిచామని చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
నిజమేంటో ప్రజలందరికీ తెలుసు అధికారులు అందరికీ తెలుసు మూడు రౌండ్ల వరకు మా జెడ్పిటిసి అభ్యర్థులు ఆధిక్యంలో ఉండగా మీకు ఇంకా ఓటమి తప్పదని తెలుసుకొని అధికారులను ఉపయోగించి మీరు చేసిన జిమ్మిక్కులు అందరూ చూశారు.
నేను మీ అందరిని సూటిగా 7 ప్రశ్నలు అడుగుతాను దీనికి సమాధానం చెప్పండి
1)కౌంటింగ్ జరుగుతుండగా కరెంట్ ఎందుకు పోయింది ?? జనరేటర్ ఉన్నా కూడా జనరేటర్ ని ఎందుకు మీరు ఆన్ చేయలేదు.ఆ అరగంటలో లోపల ఏం జరిగింది ???
కరెంటు పోగానే సీసీ కెమెరాలు ఆగిపోతాయి ప్రూఫ్ లేకుండా బ్యాలెట్ పేపర్లను తారుమారు చేసింది నిజం కాదా??
2) తాటిపర్తి మా ఎంపీటీసీ కోగిలి సుబ్రహ్మణ్యం మూడు ఓట్లతో ఓడిపోయామని చెప్పారు. దీనిపై రీకౌంటింగ్ పెట్టమని అడిగితే కలెక్టర్ రీకౌంటింగ్ పెట్టమని చెప్తే ఆర్డిఓ ఎందుకు రీకౌంటింగ్ పెట్టలేదు??
ఈ స్థానంలోనే ఇన్వాయిడ్ ఓట్లు దాదాపు 45 వైసీపీ ఎలా ఉన్నాయి??
3) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఊర్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల కట్టలను బయటపడేసిన వ్యక్తిని ఇప్పటివరకు ఏం చేశారు?? అతను ఎన్ని కట్టలు పడేసాడు ఎన్ని కట్టలు మీరు రికవరీ చేశారు?? అతనిపై ఏమైనా కేసు నమోదు చేశారా??? మరల అతన్ని ఆర్డీవో తీసుకోనీ కౌంటింగ్ హాల్లో ఎందుకు కూర్చోబెట్టాడు???
4)3 రౌండ్ల వరకు బాగా జరిగిన కౌంటింగ్ వైయస్ఆర్సీపీ ఆదిత్యంలో ఉందని తెలియగానే విజయవాడ నుండి ఫోన్ చేసింది ఎవరు? కలెక్టర్ ఎందుకు హుటాహుటిన వచ్చాడు??
కలెక్టర్ రాగానే హుటాహుటిన కౌంటింగ్ రూమ్ ను ఎందుకు మార్చారు ??? విజయవాడ నుంచి మీకు ఫోన్ వచ్చి టీడీపీ జడ్పిటిసి అభ్యర్థిని 600 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించండి అని చెప్పిన విషయం వాస్తవం కాదా???
5) YSRCP ఏజెంట్లు లేకుండా కౌంటింగ్ చేయమని ఆర్డిఓ ఎందుకు తొందర పెట్టాడు ?? పక్క కాన్స్టెన్సీ చంద్రగిరిలో మరికొన్ని కాన్స్టెన్సీలో రాత్రి 8 వరకు కౌంటింగ్ జరిగింది కదా మరి మన ఆర్డీవోకి ఎందుకు అంత తొందర??
నాలుగు మండలాలకు జడ్పిటిసి స్థానాలు ఎన్నికలు జరగాల్సింది కానీ రెండు మండలాలు మీరే లేపేశారు. మిగిలిన రెండు మండలాలు జడ్పిటిసి స్థానాలకు కౌంటింగ్ కోసం అధికారులు ఉన్నా కూడా ఆర్డిఓ ఎందుకు ఆత్రుత పడ్డాడు??
ఏజెంట్లు లేకుండా ఎలా కౌంటింగ్ చేస్తారని ఎదురు తిరిగి అడిగినదానికి మా వాళ్లను ఏజెంట్లు ఎవరూ ఉండకూడదని బయట తోసేసిన మాటతో నిజం కాదా??
6) ప్రెస్ వాళ్ళని లోపలికి ఎందుకు పంపలేదు. మీరు చేసే అరాచకాలను ప్రజలకు చూపిచ్చేస్తారని భయపడ్డారా ??
7) ప్రతి రౌండ్ కి ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందో ప్రకటించాలని రూల్ ఉంది కదా మరి మీరు ఎందుకు ఆ పని చేయలేదు??
ఉన్నం వాసుదేవ నాయుడు భారీ మెజారిటీతో ఉన్నాడని వైసీపీ ఎలాగైనా గెలుస్తుందని ఆ విషయం ప్రజలకు తెలిసిపోతుందని బయటికి చెప్పకుండా బ్యాలెట్ పేపర్లు మార్చేసింది నిజం కాదా ??
కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మీరు ఏదో మోసం చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని గెలిచామని సంబరపడిపోతున్నారు కానీ ప్రజలలో గెలిచింది మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నం వాసుదేవ నాయుడు.
2024 ఎన్నికల్లో తొట్టంబేడు మండలంలో మాకు 7000 ఓట్లు మైనస్ అదే ఈరోజు 700 ఓట్లు మైనస్ అది కూడా మీరు చేసిన రిగ్గింగ్ వల్ల దీనిబట్టే మీకు అర్థమై ఉండాలి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంత నమ్మకం ఉందో.
రిగ్గింగ్ చేసి అధికారులు అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని గెలవాల్సిందే తప్ప నీతిగా నిజాయితీగా గెలిచే దమ్ము మీకు లేదు.
ఈ కౌంటింగ్ సమయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఏ అధికారులు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసారో ఎవ్వరిని విడిచి పెట్టేది లేదు.ఈరోజు మీది రేపు అనేది ఒకటి ఉందని మీరు మర్చిపోయి మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అరాచకాన్ని ప్రోత్సహించారు.అధికారులు అందరికీ చెప్తున్నాను 2029 ఎన్నికల్లో మీ అందరూ ఎంత తప్పు చేశారో మేము చూసాం తర్వాత మీరు ఎంత ప్రాధేయపడిన మిమ్మల్ని విడిచి పెట్టేది ఉండదు.
ఈ జరిగిన మొత్తం అరాచకాలను దానికి సహకరించిన అధికారులను విత్ ప్రూఫ్లతో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తున్నాం. అలాగే తప్పు చేసిన ప్రతి ఒక్క అధికారులను కోర్టు ముందు నిలబెట్టి మీరు ఎంత పెద్ద తప్పు చేశారో ప్రజల తీర్పుని ఎలా అగౌరపరిచరో మీకు తెలిసేలా చేస్తాము.
పై విషయాలన్నీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఆల్రెడీ ఈ విషయాలను తీసుకుని వెళ్లడం జరిగింది 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తప్పు చేసిన ఎవరు తప్పించుకోలేరు. *వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*