సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిద్దాం మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు
పంచాయతీ ఎన్నికల్లో సమిష్టి కృషితో విజయం సాధిద్దాం. మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు.
సూర్య న్యూస్ దర్శి. గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటమి అభ్యర్థులు గెలుపునకు సమిష్టి కృషితో విజయం సాధిద్దాం అని మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు అన్నారు. దర్శి, ముండ్లమూరు మండలాల జనసేన నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సహాయ సహకారాలతో త్వరలో జరగబోవు పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు కు కృషి చేద్దామని కోరారు. కూటమి పొత్తులో భాగంగా ఈదర గ్రామ పంచాయతీ సర్పంచ్ ని జనసేన కేటాయించాలని, అదేవిధంగా గ్రామంలోని ప్రధాన సమస్యల గురించి చర్చించారు. దీనిపై చైర్మన్ మాట్లాడుతూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని చైర్మన్ సుబ్బారావు అన్నారు.అనంతరం చైర్మన్ దారం సుబ్బారావు ను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొప్పిడి వారి పాలెం సొసైటీ చైర్మన్ కొండారు రామాంజనేయులు, జనసేన నాయకులు ఐటి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, మున్సిపల్ కౌన్సిలర్ ఛాతిరాశి కొండయ్య, జనసేన పార్లమెంట్ కమిటీ సమన్వయకర్త పసుపులేటి చిరంజీవి, ఎంపీటీసీ రుద్ర పుప్పాల పాపారావు, జనసేన ప్రతినిధి గోరంట్ల నరేంద్ర ఈదర జనసేన నాయకులు పాడే రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.