మానవత్వం సాటుకున్న శ్రీకాళహస్తి కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి
తేరు వీధి బస్సు షెల్టర్ లో 10 రోజులుగా అనారోగ్యంతో అల్లాడుతున్న వ్యక్తి - స్థానికుల సమాచారంతో స్పందించిన శ్రీకాళహస్తి కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి.
మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.
శ్రీకాళహస్తి బస్టాండ్ లో గత పది రోజులుగా ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నాడు. తినడానికి తిండి లేక, వైద్యం అందక, ఎవరూ పట్టించుకోక అక్కడే పడి ఉన్నాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే మున్సిపల్ కమిషనర్ కి తెలియజేశారు.
స్థానికుల సమాచారం అందుకున్న వెంటనే కమిషనర్ మానవతా దృక్పథంతో స్పందించారు. వెంటనే ఏరియా హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి, ఆ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా తెలియజేశారు.
కమిషనర్ ఆదేశాలతో 108 అంబులెన్స్ సిబ్బంది బస్టాండ్ కు చేరుకొని ఆ వ్యక్తిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందుతోంది.
ఒక అనారోగ్య వ్యక్తిని చూసి చూడనట్లు వదిలేయకుండా స్థానికులు స్పందించడం, వారి మాటను గౌరవించి కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మానవత్వమే గొప్పతనం అని ఈ ఘటన మరోసారి నిరూపించిందని స్థానికులు అంటున్నారు. *వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*