స్థానిక ఎన్నికల ఫలితాలపై మాచాని హర్షం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం లో కూటమి అభ్యర్థులు గెలుపుకు సహారించిన ప్రజలకు టిడిపి రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం అయన నివాసంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీ తోపాటు ఎంపిటిసి జడ్పిటిసి స్థానాలు అఖండ మెజార్టీస్ సాధించిన ప్రతికూటమి అభ్యర్థి పట్ల ఆయన హార్షం వ్యక్తం చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థులను గ్రామ సర్పంచ్లకు ఎన్నుకొని గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లను సూచించారు. రాష్ట్రంలో మొత్తం గెలిచిన కూటమి అభ్యర్థులకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ లక్ష్మీనారాయణ, మహబూబ్ బాషా, రాజశేఖర్ ధన చిన్న తదితరులు పాల్గొన్నారు
A R శరత్ కుమార్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా