BREAKING
నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్ -కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్" అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!* *అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..! ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!* గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం

అప్పన్న దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

Select Suryaa Now
అప్పన్న దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

★పురుషులు ధోవతి, కుర్తా పైజామా.. మహిళలు చీర,లంగా ఓణీ
★జీన్స్‌,టీషర్టులు, షార్ట్స్‌కు అనుమతి లేదు
★చిన్నారులకూ సంప్రదాయ దుస్తులు ధరించాలి
★ఆలయ పవిత్రత, హిందూ ధార్మిక సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం
★సంప్రదాయ వస్త్రధారణపై ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాలు

విశాఖపట్నం, సూర్య : భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, హిందూ ధార్మిక ఆచారాలకు ప్రతీకలుగా నిలిచే దేవాలయాల్లో సంప్రదాయ వస్త్రధారణకు ప్రాధాన్యత పెరుగుతోంది.భక్తి భావానికి, ఆలయ పవిత్రతకు అద్దం పట్టేలా దేశవ్యాప్తంగా పలు ప్రముఖ దేవాలయాలు సంప్రదాయ దుస్తుల విషయంలో ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నాయి.ఇదే బాటలో ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం, సింహాచల క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ వస్త్రధారణతోనే రావాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.ఈ మేరకు సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు భారతీయ సంప్రదాయాలకు అనుగుణమైన దుస్తులు ధరించాలని కోరారు. పురుషులు ధోవతి, కుర్తా పైజామా వంటి సంప్రదాయ వస్త్రాలు, మహిళలు చీర, లంగా ఓణీ, దుపట్టాతో కూడిన చుడీదార్‌ ధరించి రావాలని సూచించారు.జీన్స్‌, టీషర్టులు, షార్ట్స్‌ వంటి ఆధునిక దుస్తులతో ఆలయ దర్శనానికి రావడం సంప్రదాయ వస్త్రధారణకు అనుగుణం కాదని సూచించారు. చిన్నారులు సైతం సంప్రదాయ దుస్తులు ధరించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
దేవాలయం కేవలం దర్శనానికి వచ్చే ప్రదేశం మాత్రమే కాదు,భక్తి, ఆధ్యాత్మికత, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమనే భావనను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది. తరతరాలుగా వస్తున్న భారతీయ వస్త్రధారణ సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు,పవిత్ర పుణ్యక్షేత్రాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు ఇలాంటి చర్యలు దోహదపడతాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు.సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో సంప్రదాయ వస్త్రధారణపై దేవస్థానం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామివారి సన్నిధికి భక్తితో,వినయంతో, సంప్రదాయబద్ధంగా చేరుకోవాలనే సందేశాన్ని ఈ నిబంధన చాటిచెబుతోంది.భక్తి మనసులో సంప్రదాయం వస్త్రధారణలో  అన్న భావనతో సింహాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక సంప్రదాయాలకు మరింత ప్రాధాన్యత కల్పించే ప్రయత్నం జరుగుతోంది.