గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి
*కోహెడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబంతో కలిసి గిరిజన మోర్చా మూడు గంటల నిరసన ధర్నా*
*కోహెడ మేజర్ న్యూస్*
కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోహెడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబంతో కలిసి గిరిజన మోర్చా మూడు గంటల నిరసన ధర్నా. పేదలకు ఇళ్లు నిర్మించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు ఒక నిరుపేద ఎస్టీ ఎరుకలి కుటుంబాన్ని నిరాశ్రయులుగా చేసి రోడ్డుపాలు చేయడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ గిరిజన మోర్చా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కోహెడ గ్రామానికి చెందిన బీజేపీ 1.వ. వార్డు సభ్యుడు కట్ట ప్రవీణ్ కుటుంబానికి చెందిన ఇంటిని రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేయడంతో సుమారు రూ.8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, 12–13 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కుటుంబాన్ని కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే నిరాశ్రయులుగా మార్చారని మండిపడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోహెడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబంతో కలిసి బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో మూడు గంటల పాటు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోత్ తిరుపతి నాయక్, సిద్దిపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్ కోహెడ మండల గిరిజన మోర్చా అధ్యక్షుడు బాణోత్ సురేష్ నాయక్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా గిరిజన మోర్చా నాయకులు మాట్లాడుతూ కట్ట ప్రవీణ్ కుటుంబానికి తక్షణమే రెండు గుంటల స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, కూల్చివేత వల్ల జరిగిన సుమారు రూ.8 లక్షల నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి శాశ్వత పరిష్కారం లభించే వరకు తక్షణమే తాత్కాలిక నివాసం కల్పించి, కనీసం చలిలో రాత్రులు గడపకుండా మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించాలని అధికారులను కోరారు. నిన్నటి నుంచి నిలువ నీడ లేక చలిలో వణుకుతూ గ్రామ పంచాయతీ ఆవరణలో తలదాచుకుంటున్న కుటుంబం పట్ల అధికారులు కనీస మానవత్వం చూపకపోవడం బాధాకరమన్నారు. ఒకవైపు పేదల సంక్షేమం అంటూనే మరోవైపు నిరుపేద గిరిజన కుటుంబాన్ని నిరాశ్రయులుగా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గిరిజన కుటుంబాలపై కక్షసాధింపు రాజకీయాలా? మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ఒక నిరుపేద ఎస్టీ కుటుంబానికి ఈ పరిస్థితి రావడం ప్రభుత్వ పాలనలో మానవత్వం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు గిరిజన మోర్చా వివిధ రూపాల్లో ఉద్యమాలు కొనసాగిస్తుందని, ఈ ఘటనను రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లి గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతామని హెచ్చరించారు. తహసీల్దార్ వ్యవహారశైలిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు, బాధిత కుటుంబాన్ని నిరాశ్రయులుగా చేసిన ఘటనపై మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోత్ తిరుపతి నాయక్ తెలిపారు. అధికారుల బాధ్యతారాహిత్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా తల్లి సొమ్మసిల్లి పడిపోవడం కలచివేసింది! ధర్నా కొనసాగుతున్న సమయంలో కట్ట ప్రవీణ్ తల్లి తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తలచుకొని, నిన్నటి నుంచి ఏడ్చి ఏడ్చి తీవ్ర ఆవేదనకు గురై సొమ్మసిల్లి పడిపోవడం అక్కడున్న వారిని కలచివేసింది. వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఒక తల్లి కన్నీటికి, ఒక పేద కుటుంబం ఆవేదనకు ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే ఇక సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలని నాయకులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ, ఒక పేద ఎస్టీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన ఘటనపై బాధ్యులైన అధికారులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం, బీజేపీ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ లకపతి, లావుడియా మహేష్, పకీడే సంపత్, మ్యాకాల చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పిల్లి నర్సయ్య, పేర్యాల సాగర్ రావు, ఖమ్మం సతీష్, గుగ్గిళ్ల శ్రీనివాస్, కొండబత్తిని సతీష్, కంది సత్యనారాయణ రెడ్డి, నాగు అజయ్, కరివేద అఖిల్ రెడ్డి, నరాల శ్రీకాంత్, బండ సుమన్, గోగికారి సతీష్, పందిపల్లి రవితేజ, అందవేని రాములు, జోగు చంద్రమౌళి, దానవేని రాజయ్య, బొమ్మగాని రంజిత్, ఎల్లబోయిన రాజ్ కుమార్, ఇట్టబోయిన శ్రీకాంత్, ముంజ సాగర్, తలారి సుధాకర్, జాలిగం అనిల్, పొన్నాల సాగర్, ఎదులపురం రాజు చారి, గడ్డం అంకుస్, ద్యాగల శేఖర్, పిల్లి ప్రకాష్, ఎగుర్ల ఐలేష్, బుర్ర రమేష్, అన్నాడి మధుసూదన్ రెడ్డి, బండారు సాయి, దానవేని రమేష్, గుంటి బాలయ్య, తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు