అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!*
*అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!*
"రూ.2 కోట్లతో బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన"
"రవాణా కష్టాలకు చెక్.."
"మురుగునీటి సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు"
::మహేశ్వరం నియో
జకవర్గం బడంగ్‌పేట్ సర్కిల్-16 పరిధి
లోని నాదర్‌గుల్ డివిజన్-57లో అల్మాస్‌గూడ–గుర్రంగూడ ప్రధాన రహదా
రికి మహర్దశ పట్ట
నుంది. అల్మాస్‌గూడ అంబేద్కర్ సెంటర్ నుంచి గుర్రంగూడ శివాలయం వరకు జీహెచ్‌ఎంసీ జనరల్ ఫండ్ నుంచి మంజూ
రైన రూ.2 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శుక్రవారం గుర్రంగూడ శివాల
యం వద్ద బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకు
స్థాపన చేశారు.ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా బీటీ రోడ్డు నిర్మాణానికిరూ.1.20 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థకు రూ.80 లక్షలు కేటాయిం
చారు. పనులు పూర్తయితే రాకపోకలు సాఫీగా సాగడంతో పాటు డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.ఈసందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అవసర
మైన మౌలిక సదు
పాయాల కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్య
మిస్తోందని, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ పనులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్
చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహే
శ్వరం కాంగ్రెస్ ఇన్
చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్య
క్రమంలో నాదర్‌గుల్ డివిజన్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నవారు మల్లా
రెడ్డి, బోయపల్లి వెంకటరెడ్డి, యాదయ్య, శ్రీనివాస చారి, దిండు శ్రీనివాస్ గౌడ్, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి, ధన్సింగ్ నాయక్, గోలి రంజిత్ రెడ్డి, పృథ్వీ రాథోడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ అధ్యక్షులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
---------------------------
బి. గణేష్ :
బాలాపూర్ రిపోర్టర్.