BREAKING
500 కి.మీ వేగంతో బీవైడీ ఎలక్ట్రిక్ కారు రికార్డు బాణసంచా విక్రయానికి ప్రభుత్వం తప్పనిసరి స్పేస్‌ఎక్స్ బోర్డు డైరెక్టర్ డొనాల్డ్ హారిసన్ రాజీనామా జపాన్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభన.. ఏటీఎంలు బంద్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా.. క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న శ్రీలీల కొత్త సినిమాల విశేషాలు చికెన్ షాప్ యజమానుల అభివృద్ధికి కృషి చేయండి * దీపావళి అమావాస్యకు వేకనూరు సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు బంగారం ధరలు భారీ పతనం.. దీపావళికి ముందు రోజు పసిడి ప్రియులకు ఊరట, నవంబర్ 7న రేట్లు ఇలా! ప్రేరక స్కూల్ లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం! ఆదిభట్ల సర్కిల్ విజయ్ సేతుపతి పాకెట్ నావెల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పొంగల్ బరిలో సంచలనానికి సిద్ధం! కళ్యాణదుర్గంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఓట్ల లెక్కింపునకు 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదు.. డీఎస్పీ దైవప్రసాద్ హెచ్చరిక రీ భూ సర్వేకు రైతులు సహకరించాలి తహసీల్దార్ వేణుగోపాల్ విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధికి పెద్దపీట పింఛన్‌దారులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ల జారీలో విప్లవాత్మక మార్పులు టెస్టు క్రికెట్‌కు షమీ సంచలన గుడ్‌బై

నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం

Select Suryaa Now
నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం

దుద్యాల్, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు శనివారం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దుద్యాల మండలం హకీంపేటలో ఏర్పాటు చేసిన రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన సవరించిన పర్యటన షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 1.45 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.30 గంటలకు హకీంపేటకు చేరుకుంటారు. 2.40 నుంచి 3.30 గంటల వరకు రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించి వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం 3.30 నుంచి 4.30 గంటల వరకు ప్రగతిశీల రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. 5.30 నుంచి 6.30 గంటల వరకు హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుని రాత్రి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులు, పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవంబర్ 7, 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు.