చికెన్ షాప్ యజమానుల అభివృద్ధికి కృషి చేయండి *
*చికెన్ షాప్ యజమానుల అభివృద్ధికి కృషి చేయండి *
మైలార్దేవ్ పల్లి, జల్ పల్లి చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తరపున డిప్యూటీ కమిషనర్ కు వినతి. చికెన్ షాపులు (కోళ్ల మాంసం విక్రయ దారులు) యజమానుల సంక్షేమం, అభివృద్ధికి, కృషి చేయాలని మైలార్దేవ్ పల్లి, జల్ పల్లి చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, జిహెచ్ఎంసి అధికారులను కోరారు. ఈ మేరకు చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి వెంకట్రామ్ ను మర్యాదపూర్వకంగా కలిసి, అసోసియేషన్ సభ్యుల సంక్షేమం, అభివృద్ధి, ప్రయోజనాలకు సంబంధించి వినతి పత్రం అందజేసి, చికెన్ షాప్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అసోసియేషన్ అభివృద్ధికి జిహెచ్ఎంసి అధికారుల సహకారం, మద్దతును కోరారు. సభ్యులందరి ప్రయోజనాల కోసం అధికారులతో సమన్వయంతో పని చేయడానికి అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. అలాగే నూతన చికెన్ షాపులకు ట్రేడ్లైసెన్సులు ఇచ్చే ముందు, అసోసియేషన్ సభ్యులతో చర్చించిన అనంతరం ట్రేడ్ లైసెన్సులు జారీ చేయాలని అధికారులను కోరారు. అలాగే ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వ్యాపారులు, కార్మికులకు ప్రభుత్వం తరఫున ఆరోగ్య భీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్, చికెన్ షాప్ యజమానులకు జిహెచ్ఎంసి తరపున పూర్తి సహకారం ఉంటుందని, కానీ చికెన్ షాప్ యజమానులు కూడా తమకు నచ్చినట్టు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దని, అధికారులకు సహకరించాలని సూచించారు. అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.