ప్రేరక స్కూల్ లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం! ఆదిభట్ల సర్కిల్
ప్రేరక స్కూల్ లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
! ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ పరిధిలోని ప్రేరక – ది స్కూల్ ఆఫ్ చేంజ్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.శుక్రవారం కేర్, యశోద, మ్యాక్సివిజన్, మహాలక్ష్మి కంటి ఆసుపత్రి, క్లోవ్ డెంటల్ వైద్య బృందాలు పాల్గొని సాధారణ ఆరోగ్య, కంటి, దంత పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు అందించారు.విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.రవికుమార్, కోఆర్డినేటర్ పి.భవాని, వైస్ ప్రిన్సిపాల్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.