BREAKING
హాలీ బెర్రీ కస్టడీ వివాదం: కాబోయే భర్త వాన్ హంట్ మద్దతు భగవంత్ మాన్ లాహోర్ పర్యటనపై పాక్ కీలక ప్రకటన రోజూ 100 యుద్ధ నౌకలతో చైనా పహారా.. యూఎస్‌కు ముసలం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరాగ్వేలో బ్యాంక్ కొలాప్స్.. సగం జనాభాకు నిధులు బంద్ 99వ వడిలో అద్వానీ.. 1995 గుజరాత్ సంక్షోభంపై నాటి వ్యాఖ్యలు అయ్యవారిపల్లి భూ బదలాయింపు కేసులో మరో కీలక చర్య కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్ల నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం అధికార పార్టీలో ఆధిపత్య పోరు...! బహిర్గతమైన విభేదాలు, ఎంపీ పర్యటనతో వేడెక్కిన రాజకీయాలు, వర్గ పోరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం, ప్రెస్ మీట్ తో రోడ్డెక్కిన విభేదాలు టిక్‌టాక్ అల్గారిథమ్‌పై ఈయూ తీవ్ర ఆరోపణలు.. భారీ ఫైన్ హెచ్చరిక $1.25 ట్రిలియన్ల వాల్యుయేషన్‌తో ఓపెన్ ఏఐ భారీ ఫండింగ్ యూఎస్ గల్ఫ్ రిఫైనరీలకు కలిసొస్తున్న ఇరాన్ సంక్షోభం తీవ్ర సంక్షోభంలో స్పైస్‌జెట్.. ప్రయాణికుల గగ్గోలు 500 కి.మీ వేగంతో బీవైడీ ఎలక్ట్రిక్ కారు రికార్డు బాణసంచా విక్రయానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి

రీ భూ సర్వేకు రైతులు సహకరించాలి తహసీల్దార్ వేణుగోపాల్

Select Suryaa Now
రీ భూ సర్వేకు రైతులు సహకరించాలి తహసీల్దార్ వేణుగోపాల్

రీ భూ సర్వేకు రైతులు సహకరించాలి
తహసీల్దార్ వేణుగోపాల్
* గపూర్నగర్లో 11న గ్రామ సభ
కందుకూరు, మేజర్ న్యూస్( నవంబర్ 06): రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ భూ సర్వే కార్యక్రమాన్ని
విజయవంతం చేసేందుకు రైతులందరు సహకరించాలని
కందుకూరు తహసీల్దార్ వేణుగోపాల్ కోరారు. శుక్రవారం
డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ కలిసి ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో ఆయన రీ భూ సర్వే వివరాలను
వెల్డించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ చట్టంలోని సెక్షన్ 41
ప్రకారం ప్రతి మండలంలో చేపడుతున్న రీ భూ సర్వేలో 
భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని 11
గ్రామాలను రెండు విడతలుగా ఎంపికి చేసినట్లు తెలిపారు.
మొదటి విడతలో అక్బర్జా,పెరుగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయిందని పేర్కొన్నారు.
రెండవ విడతలో భాగంగా గపూర్ నగర్ గ్రామంలో ఈ నెల
11 వతేదిన గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని
తెలిపారు, గ్రామ సభలో ఆర్డీవో, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొంటారని చెప్పారు.

* రైతులకు అపోహలు తొలగించేందుకే గ్రామసభ

రీ భూ సర్వేపై రైతుల్లో ఉన్న భయాలు, అపోహలను
తొలగించి,పూర్తి అవగాహన కల్పించడమే గ్రామ సభ ముఖ్య
ఉద్దేశమని తహసీల్దార్ వివరించారు. గ్రామంలో నివసిస్తున్న రైతులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులకు కూడా సమాచారం అందించి గ్రామ సభకు హజరు అయ్యేలా
చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
*కొత్త మ్యాపులతో భూములకు జీయో ట్యాగింగ్
1936 సంవత్సరంలో రూపొందించిన మ్యాపుల
ఆధారంగానే ఇప్పటికీ అనేక భూ సర్వేలు కొనసాగుతున్నాయని,రీ భూ సర్వే ద్వారా అధికారులు
నేరుగా గ్రామాలకు వచ్చి భూములను కొలిచి కొత్త
న్యూపులు రూపొందిస్తారని తెలిపారు. ప్రతి సర్వే నంబర్కు
సంబంధించిన ఖాతా నంబర్లు, భూమి విస్తీర్ణం తదితర
వివరాలను నమోదు చేసి జియో ట్యాగింగ్ చేయనున్నట్లు
తెలిపారు.దీని వల్ల భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత కూడా రైతులు తను భూమి ఎక్కడ ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉందనే విషయాలను సులభంగా గుర్తించేందకు అవకాశం ఉంటుందని వివరించారు.

* గపూర్ నగర్ లో 202.24 ఎకరాల భూమి

గపూర్నగర్ గ్రామంలో మొత్తం 41 సర్వే నంబర్లు
ఉండగా,367 మంది రైతులకు సంబంధించి 202.24
ఎకరాల భూమి ఉన్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. ఇందులో 191.14 ఎకరాల పట్టా భూమి కాగా,11.10 ఎకరాలు
ప్రభుత్వ భూమిగా ఉన్నట్లు వివరించారు.
* రైతుల భూ హక్కులకు సంబంధించిన వివరాలు పక్కగా
నమోదు కావడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో
ప్రతి రైతు భాగస్వామి కావాలని, రీ భూ సర్వేను విజయవంతం చేయాలని తాసిల్దార్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.

టి శ్రీనివాస్ మేజర్ న్యూస్ కందుకూర్