తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
పరిగి, మేజర్ న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దర్శనం అనంతరం ఆయన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.