మహాకాళిక దైవికి స్త్రీ శక్తి వైభవం..ప్రశాంత్ వర్మ విశేషాలు
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహాకాళి’పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి, ఖుష్బూ, భూమి శెట్టి, రోహిత్ సారఫ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దైవిక శక్తి, స్త్రీ ప్రాధాన్యతను చాటిచెప్పే ఈ చిత్రం ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో ఒక ప్రత్యేక దృశ్యకావ్యంగా నిలవనుంది.
ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘అయిగిరి నందిని’ స్తోత్రం లిరికల్ వీడియో సంగీత ప్రియులను, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్మరణ్ సాయి అద్భుతమైన సంగీతం అందించగా, అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ తమ మధురమైన గొంతులతో ఈ పాటకు ప్రాణం పోశారు. భక్తుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ‘అయిగిరి నందిని’ పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా, సరికొత్త సినిమాటిక్ స్కేల్‌లో దీనిని రూపొందించామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ స్తోత్రంలోని దైవిక శక్తి మరియు మహాకాళి అమ్మవారి మహిమాన్విత రూపం కొత్త తరం శ్రోతలకు మరింత చేరువయ్యేలా ఈ గీతాన్ని తీర్చిదిద్దినట్లు వారు తెలిపారు. సాంకేతిక విలువలతో పాటు శక్తివంతమైన భావోద్వేగాల కలబోతగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ సినిమా వాయిదాపై నిర్మాత పూర్తి క్లారిటీ.. అసలు కారణం ఇదే!