BREAKING
విశాఖ భీమిలి బీచ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం.... దీపావళి సామాగ్రి విక్రయాలకు అనుమతులు తప్పనిసరి.. విశాఖ జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు భద్రతా ప్రమాణాలు లేకుండా రోడ్డుపై భారీ రవాణా..చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం* పాపికొండల విహారయాత్ర ప్రారంభం.. బుసాన్ ఒప్పందంపై యూఎస్-చైనా కీలక వాణిజ్య చర్చలు ఆలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్ నిరసనల వేళ ఫ్రాన్స్‌లో 70 వేల మంది భద్రతా సిబ్బంది మోహరింపు ఫ్యూచర్ రిటైల్, కిషోర్ బియానిపై రూ. 904 కోట్ల సీబీఐ కేసు దేశీయ వ్యవహారాల్లో జోక్యానికి విదేశీ నిధులు.. ఈడీ నజరు అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు వైట్‌హౌస్ కొత్త సారథి స్టీఫెన్ మిల్లర్ ప్రస్థానం చైనా గూఢచర్య వలలో ఎన్విడియా సీఈఓ? అమెరికాలో దుమారం

ఆలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్

Select Suryaa Now
ఆలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్

ఆలూరు:కర్నూలు జిల్లా ఆలూరులోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌంటింగ్ హాల్‌లోకి ఒక్కో అభ్యర్థి తరఫున ఒక్క ఏజెంట్‌ను మాత్రమే అనుమతించడంపై రాజకీయ పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ వివిధ పార్టీల నేతలు, మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం వద్దకు భారీగా తరలిరావడంతో ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. ప్రధాన ద్వారం వద్ద ఇరువర్గాలు పారదర్శకతపై అధికారులను నిలదీస్తూ గొడవకు దిగాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్‌లో ఇద్దరు వైఎస్సార్ సీపీ (YSRCP) ఏజెంట్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మరింత ఉద్రిక్తత పెరగకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.