BREAKING
వయసుపై హాలీవుడ్ నటి సాలీ ఫీల్డ్ సరదా వ్యాఖ్యలు జైసల్మేర్ గోల్డ్ - దేశంలోనే అత్యంత అరుదైన 'బంగారం' లాంటి కానుక తాడిపత్రి, కళ్యాణదుర్గంలో టీడీపీ ఎంపీటీసీల విజయం సీఓపీ31 (COP31) సదస్సు వేళ టర్కీలో వెలుగు చూసిన ముప్పు మున్సిపాలిటీలో ఆడిట్ నిర్వహణ వేరుశనగ పంటలను కాపాడండి.. ఎమ్మెల్యేకు రైతుల మొర ఏఐ ముప్పుపై ఆందోళనల వేళే టెక్నాలజీని ఆలింగనం చేసుకుంటున్న పర్యావరణ సంస్థలు ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ-మధ్యాహ్నానికి తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జోషువా వాంగ్ తీర్పుపై విదేశీ ప్రభుత్వాల విమర్శలు 8, 9 తేదీల్లో ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నిలిపివేత.. 16 నుంచి భక్తులకు అనుమతి సైనికుల మధ్యే దీపావళి వేడుకలు-రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన ప్రతి పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపు ఇరాన్ న్యూక్లియర్ సమాచారానికి $20M రివార్డు ప్రకటించిన యూఎస్ దిమ్మగుడిలో కూటమి అభ్యర్థి ఘన విజయం 306 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా కె. రామిరెడ్డి గెలుపు పెద్దవడుగూరు మేజర్ న్యూస్: పెద్దవడుగూరు మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థి కె. రామిరెడ్డి 306 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలిచి స్పష్టమైన తీ అనూహ్యం..ఎంపీటీసీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఘన విజయం

విశాఖ భీమిలి బీచ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

Select Suryaa Now
విశాఖ భీమిలి బీచ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

మూడు పల్టీలు కొట్టిన కారు..

అక్కడక్కడే ఒకరు మృతి,ముగ్గురికి తీవ్ర గాయాలు

ఐఎన్ఎస్ కళింగ సమీపంలో త్రినేత్ర గోడను ఢీకొన్న కారు.. గీతం విద్యార్థులుగా అనుమానం

విశాఖపట్నం : సూర్య

విశాఖ భీమిలి బీచ్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ కళింగ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి త్రినేత్ర గోడను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు ఏకంగా మూడు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారంతా గీతం విద్యాసంస్థకు చెందిన విద్యార్థులుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.