జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో: నంద్యాల మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను, ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్వయంగా పరిశీలించి, ఎన్నికల నియమావళికి అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*