దీపాల ఆకృతిలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. ఆకట్టుకున్న వేడుకలు
త్రినిటి పాఠశాలలో ముందస్తు దీపావళి సంబరాలు
దీపాల ఆకృతిలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. ఆకట్టుకున్న వేడుకలు
చౌటుప్పల్, మేజర్ న్యూస్ :పట్టణ కేంద్రంలోని త్రినిటి పాఠశాలలో ముందస్తు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వినూత్నంగా దీపాల ఆకృతిలో నిలబడి ప్రదర్శన ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ పద్ధతిలో దీపావళి పండుగ విశిష్టతను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కం ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల మాట్లాడుతూ.. దీపావళి పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో జ్ఞానం, ఆనందం, సంతోషం నింపే పండుగ దీపావళి అని పేర్కొన్నారు. విద్యార్థులు పండుగల విశిష్టతను తెలుసుకోవడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించని విధంగా దీపావళి జరుపుకోవాలని, మట్టి దీపాలు వెలిగిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.