దీపాల వెలుగుల్లో సేవా స్ఫూర్తిని చాటనున్న ఎక్స్‌ప్లోరికా ‘రూపాలి సాయంత్రం’
సూర్య కరీంనగర్:దీపావళి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలోని రేకుర్తి రాజశ్రీ కన్వెన్షన్స్‌లో ఎక్స్‌ప్లోరికా ప్రీమియం స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ‘రూపాలి సాయంత్రం’ పేరుతో దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగను విద్యార్థులకు మరింత అర్థవంతంగా పరిచయం చేయడంతో పాటు, వారిలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ఈ వేడుకలను ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించనున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దీపావళి నేపథ్యంతో కూడిన నృత్య ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయుల సమన్వయంతో ఏర్పాటు చేయనున్న ఫుడ్ స్టాల్స్, క్రాఫ్ట్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. విద్యార్థుల కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఆర్ట్ ఎగ్జిబిషన్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డా. ఈ. ప్రసాద్ రావు మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడమే కాకుండా సమాజంలో ప్రేమ, ఐక్యత, మానవత్వం వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటూనే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, అనుకర్ రావు, రాకేష్, ప్రాచి, వి.యు.ఎం. ప్రసాద్, వినోద్ రావు ,ప్రిన్సిపాల్ శర్మిష్ఠ ,సమన్వయకర్త ప్రియాంక మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.