శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు
సూర్య నాగిరెడ్డిపేట::నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ముగ్గురు అయ్యప్ప స్వాములు శబరిమలై పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు.వేణు,సిద్దు, నరేందర్ స్వాములు శుక్రవారం ఉదయం తాండూర్ గ్రామంలోని త్రిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి,అనంతరం అయ్యప్ప నామస్మరణ, భక్తిశ్రద్ధల నడుమ శబరిమలై పాదయాత్రను ప్రారంభించారు.అయ్యప్ప స్వామిపై ఉన్న అపార భక్తితో కఠినమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన స్వాములకు గ్రామస్తులు, భక్తులు శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి కృపతో యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు వంశీకృష్ణ గౌడ్, గంగాధర్ స్వామి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.