సమయపాలన పాటించని ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది!
సూర్య చింతల మానేపల్లి :కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి: ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పాటించాల్సిన అధికారులు, సిబ్బందే నిబంధనలు పట్టించుకోకపోతే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేది ఎప్పుడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చింతలమానేపల్లి మండల ఎంపిడిఓ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలోనూ పలు కుర్చీలు ఖాళీగా దర్శనమివ్వడం కార్యాలయ నిర్వహణపై చర్చకు దారితీసింది. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అధికారులు, సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు నిర్ణీత సమయానికి హాజరై ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఉన్నతాధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.