telangana
ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభించిన సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ
సూర్య గన్నేరువరం గునుకులకొండాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని శనివారం సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ , ఉప సర్పంచ్, న్యాలపట్ల పట్ల రాజు పాలకవర్గ సభ్యులు పరశురామ్ గౌడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, పిట్టల రాజేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.