BREAKING
జిల్లా ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు నారాయణపేట జిల్లాలో 151 విద్యా వాలంటీర్ల నియామకం -- ఈ నెల 13 వరకు దరఖాస్తుల స్వీకరణ.. -- నెలకు రూ.8 వేల గౌరవ వేతనం జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ దీపావళి శుభాకాంక్షలు రేపల్లె లో ఓట్లు లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి క్యాన్సర్‌పై అవగాహనే ఆయుధం.. టీకాల పంపిణీకి ప్రత్యేక చర్యలు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పెంగరగుంట ఎంపీటీసీగా భువనేశ్వరి ఘన విజయం 224 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపు నిబంధనలకు అనుగుణంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ డిసెంబర్ 12న కుటుంబంతో అయోధ్య రామాలయానికి అఖిలేష్ జహీర్ రికార్డు తుడిచిపెట్టిన గర్నూర్ బ్రార్.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర! రెండు నగరాల మేయర్ల ఆత్మీయ కలయిక… కుటుంబ అనుబంధానికి అపూర్వ గౌరవం శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. వన్డే కెరీర్‌లో తొలిసారి అలా! విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసిన మంత్రి గొట్టిపాటి వెలుగుల పండుగ.. విద్యార్థుల సంబరాలు! మోదీతో ముఖాముఖి చర్చకు ఒప్పించండి: అమిత్ షాకు రాహుల్ సవాల్

పేదల సొంతింట్లో దీపావళి వెలుగులు! మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
పేదల సొంతింట్లో దీపావళి వెలుగులు! మంత్రి పొన్నం ప్రభాకర్
 హుస్నాబాద్, : దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ప్రజాపాలన ప్రభుత్వం సాకారం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డులో శనివారం నిర్వహించిన ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.హుస్నాబాద్‌కు చెందిన పొన్నం కోమల–సమ్మయ్య ముదిరాజ్ దంపతులు దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో వారి నూతన గృహంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు మంత్రి హాజరయ్యారు. లబ్ధిదారు కుటుంబానికి నూతన వస్త్రాలు అందించి, స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
 
2,500కు పైగా ఇళ్లలో దీపావళి సంబరాలు..
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు.500 గుడిసెల స్థానంలో నూతన ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు, మధ్యలో నిలిచిపోయిన మరో 500 ఇళ్లకు, రెండో దశలో అదనంగా 1,000 ఇళ్లకు మంజూరు లభించిందని తెలిపారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు.
రెండో దశలో మంజూరైన ఇళ్లకు సంబంధించి మరో వారం, పది రోజుల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించే ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. రూఫ్ లెవల్‌కు చేరుకున్న లబ్ధిదారులు కూడా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ తమ సొంతింట్లో దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.
 
సొంతింట్లో పండుగ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది: కోమల–సమ్మయ్య
 
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు పొన్నం కోమల–సమ్మయ్య దంపతులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలిపారు. ఈ ఏడాది సొంతింట్లో దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.