BREAKING
రామాయణ' మూవీపై దర్శకుడు శంకర్ ప్రశంసలు: రావణుడిగా యష్ నటన అద్భుతమంటూ కామెంట్స్ న్యోమా ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ సరికొత్త రికార్డు నిన్న మరణం.. నేడు విజయం..! రామాయణ' మూవీపై దర్శకుడు శంకర్ ప్రశంసలు: రావణుడిగా యష్ నటన అద్భుతమంటూ కామెంట్స్ మనిషి జీవితాన్ని మార్చేది పుస్తక పఠనమే-వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య-హనుమకొండ లో ఘనంగా నవచేతన పుస్తక ప్రదర్శన ప్రారంభం మాతృభూమి' లాంటి దేశభక్తి సినిమాలో 'తేరి సెక్సీ బ్యూటీ' పాటపై సోషల్ మీడియాలో ట్రోల్స్: సల్మాన్ ఖాన్ సమాధానం వేరుశనగ సబ్సిడీ అక్రమాలపై విచారణ జరపాలి మై హూ నా' పాటలకు శ్రేయా ఘోషాల్‌ను వద్దన్నారు: పరిశ్రమ ప్రతిఘటనపై ఫరా ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో భారీగా అక్రమ డిఫెన్స్ మద్యం స్వాధీనం: మాజీ సైనికులపై కేసు మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి జాన్ కుసాక్ సైకలాజికల్ హర్రర్ ఫిల్మ్ '1408' సీక్వెల్‌లో నటాలియా డయ్యర్, ఎలిజా వుడ్ వైల్డ్ హార్స్ నైన్' లో పురుషుల సంబంధాలు, స్నేహం పరిమితులపై జాన్ మాల్కోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు జేమ్స్ బాండ్ 007 రేసులో రాబర్ట్ ప్యాటిన్సన్, నికోలస్ హౌల్ట్: తదుపరి ఏజెంట్‌గా ఎవరు నిలవనున్నారు? DLS పద్ధతిలో భారత్ విజయం.. 2-0 ఆధిక్యంలో గిల్ సేన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

నిబంధనలకు అనుగుణంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

Select Suryaa Now
నిబంధనలకు అనుగుణంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి  నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం  జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

బాపట్ల, మేజర్‌న్యూస్ :

దీపావళి సందర్భంగా బాణాసంచా తయారీ కేంద్రాలు, నిల్వ గోదాములు, విక్రయ దుకాణాలను నిర్వహించేవారు తప్పనిసరిగా అనుమతులు, లైసెన్సులు పొందాలని, నిర్దేశించిన నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. రాబోయే దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యల గురించి శుక్రవారం జిల్లా ఎస్పీ గారు వివరించారు.

బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలు:

???? బాణాసంచా తయారీ కేంద్రాలను సంబంధిత అనుమతులు పొందిన ప్రదేశాల్లోనే నిర్వహించాలి.
???? అనుమతులు లేని ప్రదేశాల్లో బాణాసంచా తయారీ చేయడం, పేలుడు పదార్థాలను నిల్వ చేయడం నిషేధం.
???? తయారీ కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా అవసరమైన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
???? తయారీ కేంద్రాల్లో పొగతాగడం, అగ్గిపుల్లలు వెలిగించడం, బహిరంగ మంటలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం.
???? అక్కడ పనిచేసే సిబ్బందికి అవసరమైన భద్రతా పరికరాలను అందుబాటులో ఉంచాలి.
???? అనుమతించిన పరిమితికి మించి పేలుడు పదార్థాలను నిల్వ చేయరాదు.

బాణాసంచా విక్రయ దుకాణాలు:

???? బాణాసంచా విక్రయించేందుకు అనుమతులు తప్పనిసరిగా పొందాలి.
???? తాత్కాలిక బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు సైతం అనుమతి తీసుకోవాలి.
???? అనుమతులు మంజూరైన ప్రదేశాల్లోనే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలి.
???? దుకాణాల మధ్య నిబంధనల ప్రకారం నిర్దేశించిన దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి.
???? ఆసుపత్రులు, పాఠశాలలు, అధిక జనసమ్మర్థం ఉండే ప్రాంతాలకు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను ఏర్పాటు చేయరాదు.
???? దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటిని తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి.
???? దుకాణాల పరిసరాల్లో పొగతాగడం, అగ్గిపుల్లలు వెలిగించడం, బహిరంగ మంటలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం.
???? విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన విద్యుత్ వైరింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
???? అనుమతించిన పరిమితికి మించి బాణాసంచాను నిల్వ చేయరాదు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేపట్టినా, అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.

జిల్లాలో ఎక్కడైనా బాణాసంచా సామగ్రి అక్రమ తయారీ, నిల్వకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112 లేదా బాపట్ల జిల్లా పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 8333813228కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ గారు సూచించారు.