పెంగరగుంట ఎంపీటీసీగా భువనేశ్వరి ఘన విజయం 224 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపు
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు రూరల్ మండలంలోని పెంగరగుంట ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భువనేశ్వరి జగదీష్ నాయుడు ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి కిషోర్‌పై 224 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించి ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి కృషి, సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి ఓటు వేసిన పెంగరగుంట పంచాయతీ ప్రజలకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని భువనేశ్వరి తెలిపారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్