జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ దీపావళి శుభాకాంక్షలు
మెదక్, : జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అధిక శబ్దం, వాయు కాలుష్యానికి కారణమయ్యే టపాసులకు దూరంగా ఉండాలని కోరారు.ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలని, తగిన భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా చూడాలని సూచించారు.దీపావళి పర్వదినం జిల్లా ప్రజలందరి ఇళ్లలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు.