నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన
సూర్య,భీమ్‌గల్:రైతులకు సాగు ఖర్చులు తగ్గించి, పంట దిగుబడిని పెంచే లక్ష్యంతో ఆత్మ వారి సౌజన్యంతో శనివారం చెంగల్, భీమ్‌గల్ గ్రామాలలోనానో యూరియా, నానో డీఏపీ ఎరువులపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులకు నానో ఎరువుల వినియోగం, పిచికారీ చేసే విధానం, నానో టెక్నాలజీ ప్రాముఖ్యతపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను సరైన పద్ధతిలో వినియోగించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పంటల పోషక యాజమాన్యాన్ని మెరుగుపరచుకోవచ్చని వివరించారు. అనంతరం రైతులకు నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బద్దం లావణ్య, గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ, వ్యవసాయ విస్తరణ అధికారులు దివ్య, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.