అనుమతి లేకుండా బోర్లు వేస్తే చట్టపరమైన చర్యలు
సూర్య,భీమ్‌గల్ ఎల్‌నినో ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు, భూగర్భ జలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్న నేపథ్యంలో కొత్త బోరుబావుల తవ్వకాలపై నిషేధం విధించినట్లు భీమ్‌గల్ తహసీల్దార్ తెలిపారు.ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సంబంధిత అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందకుండా మండల పరిధిలోని ఎవరూ తమ వ్యవసాయ భూముల్లో, నివాస గృహాల వద్ద లేదా ఇతర ప్రాంతాల్లో కొత్త బోరుబావులు తవ్వించరాదని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, ముందస్తు అనుమతి లేకుండా బోరుబావులు తవ్వించిన వారిపై నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మండల ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని తహసీల్దార్ కోరారు.