ఎవరికీ తెలియని సునీల్ అసలు రూపం ఇదే.. డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా అగ్రశ్రేణి దర్శకుడిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు, సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో సోషల్ మీడియా వేదికగా ఆయన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు, గతంలో ఆయన పంచుకున్న కొన్ని మధురమైన జ్ఞాపకాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన స్నేహితుడు, ప్రముఖ నటుడు సునీల్‌తో ఉన్న దశాబ్దాల అనుబంధం గురించి త్రివిక్రమ్ గతంలో ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నప్పటికీ, తమ మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని నిజమైన స్నేహమని ఆయన స్పష్టం చేశారు.
సునీల్ గురించి తాను చాలా ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడనని, ఎందుకంటే తమ మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను పదే పదే బయటపెట్టుకోవడం ఇష్టం ఉండదని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని తరచూ అందరి ముందు చెప్పుకోవడం వల్ల ఆ బంధం యొక్క విలువ పల్చబడిపోతుందనే చిన్న భయం తనలో ఉంటుందని ఆయన మనసులోని మాటను పంచుకున్నారు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా, సంతోషం కలిగినా ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకుంటామని, ఏ విజయాడినైనా, బాధనైనా కలిసికట్టుగా దాటుకుంటూ వచ్చామని ఆయన గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో పంజాగుట్టలోని ఒక ప్రత్యేకమైన గదిని గుర్తుచేసుకుంటూ, తమ జీవితంలోని ప్రతి మైలురాయి అక్కడి నుంచే మొదలైందని తెలిపారు.
తన జీవితంలో సునీల్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునే నిజమైన మిత్రుడని త్రివిక్రమ్ ఎమోషనల్ అయ్యారు. అద్దంలో తన గురించి తాను మాట్లాడుకున్నట్లే సునీల్ గురించి మాట్లాడటం ఉంటుందని, అందుకే ఇకపై అతని గురించి బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. సునీల్ మళ్లీ తన ప్రతిభతో జూలు విదిలించి పూర్వవైభవాన్ని పొందాడని, ఇకపై దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పనిలేదని ఆయన పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త టాలీవుడ్ ప్రేక్షకులను, ముఖ్యంగా వీరిద్దరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Also Read: సురేఖ వాణి సంచలన ప్రకటన.. నా అకౌంట్ హ్యాక్..ఆ వీడియోలు షేర్ చేయకండి