BREAKING
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం* పాపికొండల విహారయాత్ర ప్రారంభం.. బుసాన్ ఒప్పందంపై యూఎస్-చైనా కీలక వాణిజ్య చర్చలు ఆలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్ నిరసనల వేళ ఫ్రాన్స్‌లో 70 వేల మంది భద్రతా సిబ్బంది మోహరింపు ఫ్యూచర్ రిటైల్, కిషోర్ బియానిపై రూ. 904 కోట్ల సీబీఐ కేసు దేశీయ వ్యవహారాల్లో జోక్యానికి విదేశీ నిధులు.. ఈడీ నజరు అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు వైట్‌హౌస్ కొత్త సారథి స్టీఫెన్ మిల్లర్ ప్రస్థానం చైనా గూఢచర్య వలలో ఎన్విడియా సీఈఓ? అమెరికాలో దుమారం చౌకైన పాలసీకి మారితే ఐదేళ్ల ప్రొటెక్షన్ గల్లంతు! కమల్ హాసన్: భారతీయ సినిమా ప్రయోగశాల.. ఒక నటుడిగా ఆయన ప్రయాణం! సౌదీ అరేబియాలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పర్యటన ముందు యుద్ధం ఆపండి.. తర్వాతే చర్చలు: రష్యాకు యూరప్ తేల్చివేత నేటినుంచి మూడు రోజులు కొడంగల్ లో సీఎం పర్యటన

వివేక్ ఒబెరాయ్ గొప్ప మనసు.. రామాయణం సినిమా రెమ్యునరేషన్ మొత్తం క్యాన్సర్ పిల్లలకే విరాళం!

Select Suryaa Now
వివేక్ ఒబెరాయ్ గొప్ప మనసు.. రామాయణం సినిమా రెమ్యునరేషన్ మొత్తం క్యాన్సర్ పిల్లలకే విరాళం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ తెరపైనే కాకుండా నిజజీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణం సినిమాలో ఆయన విభీషణుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన నటనకు గాను తనకు రావాల్సిన రూ. 6 కోట్ల భారీ పారితోషికాన్ని ఆయన పూర్తిగా విరాళంగా ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశారు. సినిమా రంగంలో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోసం పోటీ పడే ఈ రోజుల్లో, ఒక ప్రముఖ నటుడు ఏమాత్రం ఆలోచించకుండా తన మొత్తం పారితోషికాన్ని క్యాన్సర్‌తో పోరాడుతున్న నిరుపేద చిన్నారుల వైద్య చికిత్స కోసం కేటాయించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

వివేక్ ఒబెరాయ్ తన నిర్ణయాన్ని అమలుపరుస్తూ, ఆ రూ. 6 కోట్ల మొత్తాన్ని తనకు కాకుండా క్యాన్సర్ బాధితులైన చిన్నపిల్లల వైద్య సహాయం కోసం నేరుగా అందించాలని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాను స్వయంగా కోరారు. కేవలం సినిమా రెమ్యునరేషన్‌ను వదులుకోవడంతో ఆగకుండా, తన జీవితంలో అత్యంత మైలురాయి అయిన 50వ పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న 50 మంది పేద చిన్నారుల పూర్తి వైద్య ఖర్చులను తానె భరిస్తున్నట్లు ప్రకటించారు. తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజును ఇలాంటి గొప్ప సామాజిక సేవకు వినియోగించడం ద్వారా ఆయన ఎన్నో నిరుపేద కుటుంబాల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతూ నిజమైన మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ అద్భుతమైన ఉదారతా గుణం గురించి తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వివేక్ ఒబెరాయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రియల్ హీరోలు ఉండటం అరుదు అని, ఆయన చూపిన చొరవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని కామెంట్లు పెడుతున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పట్ల సినీ ప్రముఖులు సైతం అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో పాటు, వివేక్ ఒబెరాయ్ చేసిన ఈ గొప్ప సేవ తెలుగు, హిందీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.