నేటినుంచి మూడు రోజులు కొడంగల్ లో సీఎం పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.9,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు మేళాతో పాటు ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులు, పారిశ్రామికవేత్తలు మరియు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.