BREAKING
1.25 ట్రిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్‌తో 11 బిలియన్ డాలర్ల భారీ నిధుల సేకరణ అభయ్ వర్మ స్టైల్ పాఠాలు: షారూఖ్ ఖాన్ స్ఫూర్తితో ప్రత్యేక ప్రయాణం! రకుల్ ప్రీత్‌సింగ్ ఎమోషనల్ పోస్ట్.. రామాయణంలో శూర్పణఖ పాత్ర చాలా ప్రత్యేకం! అలస్కాలో తిరస్కరించిన బ్యాలెట్ రికార్డుల కోసం మేరీ పెల్టోలా ప్రచార బృందం న్యాయపోరాటం కాలిఫోర్నియా బ్యాలెట్ వివాదం-వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్న ట్రంప్ యంత్రాంగం పీసీ, కన్సోల్ గేమింగ్‌పై మహేష్ బాబు దృష్టి: లక్ష రూపాయలతో సోలార్ వెహికల్ తయారు చేసిన 17 ఏళ్ల విద్యార్థి వైట్‌హౌస్ వద్ద ఆయుధాలతో వెనిజులా వ్యక్తి అరెస్ట్ మైక్ టైసన్ మాజీ భార్య రాబిన్ గివెన్స్ హాలీవుడ్ హిల్స్ ఇల్లు: 3.5 మిలియన్ డాలర్లకు సేల్‌! హ్యూస్టన్ మేయర్- ICEతో పోలీసుల సహకారానికి కోత యూఎస్ మిడ్‌టర్మ్స్‌లో డెమొక్రాట్ల క్లీన్‌స్వీప్.. ట్రంప్‌కు భారీ షాక్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడి కోర్టునీ కర్దాషియాన్ విడాకుల పుకార్లు అయోధ్యలో వైభవంగా పదివ దీపోత్సవ వేడుకలు మలయాళ నటి అతుల్య చంద్ర సంచలన ఫిర్యాదు.. డాక్టర్‌పై అత్యాచారం, వేధింపుల కేసు నమోదు!

అధికార పార్టీలో ఆధిపత్య పోరు...! బహిర్గతమైన విభేదాలు, ఎంపీ పర్యటనతో వేడెక్కిన రాజకీయాలు, వర్గ పోరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం, ప్రెస్ మీట్ తో రోడ్డెక్కిన విభేదాలు

Select Suryaa Now
అధికార పార్టీలో ఆధిపత్య పోరు...! బహిర్గతమైన విభేదాలు, ఎంపీ పర్యటనతో వేడెక్కిన రాజకీయాలు, వర్గ పోరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం, ప్రెస్ మీట్ తో  రోడ్డెక్కిన విభేదాలు

కాటారం, మేజర్ న్యూస్, ఆ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నియోజకవర్గంలో పట్టు కోల్పోకూడదనే ఒక ముఖ్య నాయకుడి ఆధిపత్య ధోరణి.. స్థానిక ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి కేడర్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎంపీకి క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఆదరణను సదరు ముఖ్య నేత జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. "నియోజకవర్గంలో ఎంపీ గ్రాఫ్ పెరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు?" అంటూ కిందిస్థాయి నాయకులను సదరు నేత గద్దించినట్లు సమాచారం. దీంతో సదరు నాయకుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయంతో, స్థానిక ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సొంత పార్టీ ఎంపీపైనే విమర్శల దాడికి దిగడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. సొంత పార్టీ ఎంపీని బహిరంగంగా విమర్శించాల్సి రావడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర ఆత్మరక్షణలో పడ్డట్లు సమాచారం. రేపు నియోజకవర్గ ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలని వారు అంతర్గతంగా మథనపడుతున్నారు. అయితే, ఈ బహిరంగ విమర్శల వెనుక సదరు ముఖ్య నేత పట్ల ఉన్న భయమే ప్రధాన కారణమని కేడర్ చర్చించుకుంటోంది. నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా.. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం (హైకమాండ్) దృష్టికి తీసుకెళ్లడానికి కూడా స్థానిక పెద్దలు సైతం భయంతో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీతో కనీసం ఫొటో దిగడానికి కూడా కార్యకర్తలు భయపడుతున్నారంటే, నియోజకవర్గంలో సదరు నాయకుడి ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలావుండగా ఎంపీగా గెలిచి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటివరకు ఈ ప్రాంతంలో జరిగిన ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా ఆయన కొయ్యూరు ప్రాంతంలో పర్యటించడంతో, ఇరు వర్గాల మధ్య ఉన్న పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఒకపక్క స్థానిక ముఖ్య నేత హుకుం.. మరోపక్క ఎంపీ పర్యటనతో కేడర్ ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నాయకులు తమ సొంత అజెండాలను, వర్గ విభేదాలను పక్కనబెట్టి పార్టీ కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేయాలని నియోజకవర్గ కేడర్ కోరుతోంది. నాయకుల ఇగోల మధ్య తాము నలిగిపోతున్నామని, గ్రూపు తగాదాలు ఆపి ఎంపీ ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, అభివృద్ధికి సహకరించాలని స్థానిక ప్రజలు, ద్వితీయ శ్రేణి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పెద్దలు జోక్యం చేసుకుని ఈ అంతర్గత పోరుకు అడ్డుకట్ట వేయకపోతే, రాబోయే రోజుల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

రిపోర్టర్; సుధాకర్ రెడ్డి, కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా