కోర్టునీ కర్దాషియాన్ విడాకుల పుకార్లు
హాలీవుడ్ ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్ కోర్టునీ కర్దాషియాన్, ఆమె భర్త, ప్రముఖ రాక్ మ్యూజిషియన్ ట్రావిస్ బార్కర్ విడిపోతున్నారంటూ ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే, ఈ విడాకుల పుకార్లను కోర్టునీ తీవ్రంగా ఖండించారు.
తాజాగా ఒక కార్యక్రమాల్లో ఈ విషయంపై స్పందించిన కోర్టునీ, తమ పబ్లిసిస్ట్ ఈ వార్త గురించి ప్రశ్నించినప్పుడు "వాటిని ప్రచురించుకోమని చెప్పు, ఏం జరుగుతుందో చూద్దాం" అని సమాధానమిచ్చినట్లు చెప్పారు. ఈ రూమర్లు ఎంత మాత్రం నిజం కాదని, ప్రజలు ఎంత త్వరగా అసత్య వార్తలను నమ్ముతారో చూసి ఆశ్చర్యం కలిగిందని ఆమె తెలిపారు.
ఈ పుకార్లకు అసలు కారణం టిక్‌టాక్ లో కొందరు తయారుచేసిన తప్పుడు వీడియోలేనని కోర్టునీ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేని అసత్య కథనాలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం, వాటిని నిజమని నమ్మడం చాలా విచిత్రంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
2022లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంటకు నవంబర్ 2023లో రాకీ అనే కుమారుడు జన్మించాడు. వివాహబంధంలో దంపతులిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, తమ బంధంపై ఎలాంటి అపోహలకు చోటులేదని ఈ వ్యాఖ్యలతో స్పష్టమైంది.