BREAKING
కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పుల ఘటన గుజరాత్‌లో ప్లాస్టిక్ హోల్‌సేల్ దుకాణంలో చెలరేగిన మంటలు జడ్పిటిసి ఎంపిటిసి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం విషపూరితంగా మారుతున్న దిల్లీ గాలి ఐపీవోల ద్వారా రూ. 2.23 లక్షల కోట్ల భారీ నిధుల సమీకరణ ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ క్లీన్ ఎంటర్‌టైనర్ సినిమా.. భారత్ ఆర్థిక వ్యవస్థపై హెచ్‌ఎస్‌బీసీ (HSBC) నివేదిక ప్రశంసలు మహాకాళిక దైవికి స్త్రీ శక్తి వైభవం..ప్రశాంత్‌ వర్మ విశేషాలు సుందరమైన విద్యుత్ కాంతులతో దీప్తిమంతమైన శ్రీరామ జన్మభూమి ప్రజా తీర్పుకి పట్టం కట్టాల్సిందే! సినిమాల్లో శృంగార సన్నివేశాలపై ఇనేయా వ్యాఖ్యలు! కృత్రిమ మేధస్సు వృద్ధి మందగిస్తే ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం ధనుష్ క్షమాపణలు: 'ఓమ్' ఆడియో లాంచ్‌లో అభిమానులకు చుక్కెదురు మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ సినిమా వాయిదాపై నిర్మాత పూర్తి క్లారిటీ.. అసలు కారణం ఇదే! రణ్‌బీర్ కపూర్ దీపావళి జ్ఞాపకాలు: చెప్పులు ధరించినందుకు తండ్రి రిషి కపూర్ కొట్టిన ఘటన!

అయ్యవారిపల్లి భూ బదలాయింపు కేసులో మరో కీలక చర్య

Select Suryaa Now
అయ్యవారిపల్లి భూ బదలాయింపు కేసులో మరో కీలక చర్య


* భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ రాజ్‌కుమార్ శాశ్వత తొలగింపు
* ఇప్పటికే తహసీల్దార్ అద్దంకి సునీత సస్పెన్షన్.. తదుపరి వంతు ఎవరికి?
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలో వెలుగుచూసిన అక్రమ భూ బదలాయింపు వ్యవహారంలో రెవెన్యూ శాఖ మరో కీలక చర్య తీసుకుంది. ఈ వ్యవహారంపై పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాల నేపథ్యంలో చేపట్టిన విచారణలో అచ్చంపేట జాయింట్ కలెక్టర్ సలోని చాబ్రా సమర్పించిన నివేదిక ఆధారంగా భూభారతి కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.ఇదే వ్యవహారంలో తహసీల్దార్‌గా పనిచేసిన అద్దంకి సునీతను కూడా అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కంప్యూటర్ ఆపరేటర్‌పై తీసుకున్న చర్యతో ఈ భూ బదలాయింపు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.సర్వే నంబర్ 115లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ బదలాయింపుల వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఈ వ్యవహారంలో మరిన్ని బాధ్యులపై చర్యలు ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి. పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులందరినీ గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు వెలువడటంతో రెవెన్యూ శాఖలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. విచారణ నివేదికలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.