ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం*
*ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం*
* చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
* తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. అనంతరం బ్యాలెట్ బాక్సుల ఓట్ల లెక్కింపు
- చీరాల: చీరాల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు.చీరాల మండలంలో మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలకు 168 మంది అభ్యర్థులు పోటీ పడగా, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.