BREAKING
శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే లారీ ఢీకొని మహిళ మృతి.. భర్తకు తీవ్ర గాయాలు ఏడాదిలోనే అత్యధిక లాభాలను నమోదు చేసిన నిఫ్టీ, సెన్సెక్స్ పోస్టల్ బ్యాలెట్ లో టిడిపి పర్చూరులో ముందంజ భారత్ - ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం ఖుల్నా రైల్వే స్టేషన్ వద్ద నల్లటి మసి పూసిన దుండగులు వయసుపై హాలీవుడ్ నటి సాలీ ఫీల్డ్ సరదా వ్యాఖ్యలు జైసల్మేర్ గోల్డ్ - దేశంలోనే అత్యంత అరుదైన 'బంగారం' లాంటి కానుక తాడిపత్రి, కళ్యాణదుర్గంలో టీడీపీ ఎంపీటీసీల విజయం సీఓపీ31 (COP31) సదస్సు వేళ టర్కీలో వెలుగు చూసిన ముప్పు మున్సిపాలిటీలో ఆడిట్ నిర్వహణ వేరుశనగ పంటలను కాపాడండి.. ఎమ్మెల్యేకు రైతుల మొర ఏఐ ముప్పుపై ఆందోళనల వేళే టెక్నాలజీని ఆలింగనం చేసుకుంటున్న పర్యావరణ సంస్థలు ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ-మధ్యాహ్నానికి తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

తాడిపత్రి, కళ్యాణదుర్గంలో టీడీపీ ఎంపీటీసీల విజయం

Select Suryaa Now
తాడిపత్రి, కళ్యాణదుర్గంలో టీడీపీ ఎంపీటీసీల విజయం

 అనంతపురం:ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ (MPTC) ఓట్ల లెక్కింపులో మొదట వెలువడిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాల నుంచే తెలుగుదేశం పార్టీ-కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు.

తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దవడుగూరు మండలంలో టీడీపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు:

 * వీరుపాపురం: పెద్దవడుగూరు మండలం వీరుపాపురం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మిదేవి 644 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

 * దిమ్మగుడి: ఇదే మండలంలోని దిమ్మగుడి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కే. రామిరెడ్డి 297 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అటు కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని బోరంపల్లి ఎంపీటీసీ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థి విజయాన్ని కైవసం చేసుకున్నారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్‌తో పాటు సాధారణ ఓట్ల లెక్కింపులోనూ కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతుండటంతో ఆయా కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.