BREAKING
శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే లారీ ఢీకొని మహిళ మృతి.. భర్తకు తీవ్ర గాయాలు ఏడాదిలోనే అత్యధిక లాభాలను నమోదు చేసిన నిఫ్టీ, సెన్సెక్స్ పోస్టల్ బ్యాలెట్ లో టిడిపి పర్చూరులో ముందంజ భారత్ - ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం ఖుల్నా రైల్వే స్టేషన్ వద్ద నల్లటి మసి పూసిన దుండగులు వయసుపై హాలీవుడ్ నటి సాలీ ఫీల్డ్ సరదా వ్యాఖ్యలు జైసల్మేర్ గోల్డ్ - దేశంలోనే అత్యంత అరుదైన 'బంగారం' లాంటి కానుక తాడిపత్రి, కళ్యాణదుర్గంలో టీడీపీ ఎంపీటీసీల విజయం సీఓపీ31 (COP31) సదస్సు వేళ టర్కీలో వెలుగు చూసిన ముప్పు మున్సిపాలిటీలో ఆడిట్ నిర్వహణ వేరుశనగ పంటలను కాపాడండి.. ఎమ్మెల్యేకు రైతుల మొర ఏఐ ముప్పుపై ఆందోళనల వేళే టెక్నాలజీని ఆలింగనం చేసుకుంటున్న పర్యావరణ సంస్థలు ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ-మధ్యాహ్నానికి తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

8, 9 తేదీల్లో ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నిలిపివేత.. 16 నుంచి భక్తులకు అనుమతి

Select Suryaa Now
8, 9 తేదీల్లో ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నిలిపివేత.. 16 నుంచి భక్తులకు అనుమతి

తిరుమల:తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియంలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 8, 9 తేదీలలో ట్రయల్ రన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది.

తిరిగి నవంబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయులు (జర్నలిస్టులు) వారి కుటుంబ సభ్యులు, టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఇతర పాఠశాలల విద్యార్థులు మరియు శ్రీవారి సేవకులకు మ్యూజియం ఉచిత సందర్శనకు అనుమతిస్తారు.

అనంతరం నవంబర్ 16వ తేదీ నుంచి సాధారణ సందర్శకులు మరియు భక్తుల కోసం ఎస్వీ మ్యూజియంను పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. ప్రవేశ రుసుము రూ.50గా నిర్ణయించినట్లు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (PRO) ప్రకటనలో తెలిపారు.