ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ-మధ్యాహ్నానికి తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం 8 గంటలకు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. శనివారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బండి ఆత్మకూరు, సిరివెళ్ల సంబంధించి ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 28 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో 8 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 20 స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 377 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 152 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, ఒక స్థానంలో అభ్యర్థులు లేరని, మిగిలిన 224 స్థానాలకు పోటీ జరిగిందని తెలిపారు. ఈ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహణ ఓట్ల లెక్కింపు ప్రారంభ దశలో బ్యాలెట్ పత్రాల సెగ్రిగేషన్, బండ్లింగ్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. తొలి రౌండ్ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నానికి వెలువడే అవకాశం ఉందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో క్రమశిక్షణ, నిబంధనలను పకడ్బందీగా ఉందని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు వివరణ అందిస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రానికల్లా పూర్తయ్యేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*