BREAKING
నిన్న మరణం.. నేడు విజయం..! రామాయణ' మూవీపై దర్శకుడు శంకర్ ప్రశంసలు: రావణుడిగా యష్ నటన అద్భుతమంటూ కామెంట్స్ మనిషి జీవితాన్ని మార్చేది పుస్తక పఠనమే-వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య-హనుమకొండ లో ఘనంగా నవచేతన పుస్తక ప్రదర్శన ప్రారంభం మాతృభూమి' లాంటి దేశభక్తి సినిమాలో 'తేరి సెక్సీ బ్యూటీ' పాటపై సోషల్ మీడియాలో ట్రోల్స్: సల్మాన్ ఖాన్ సమాధానం వేరుశనగ సబ్సిడీ అక్రమాలపై విచారణ జరపాలి మై హూ నా' పాటలకు శ్రేయా ఘోషాల్‌ను వద్దన్నారు: పరిశ్రమ ప్రతిఘటనపై ఫరా ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్‌లో భారీగా అక్రమ డిఫెన్స్ మద్యం స్వాధీనం: మాజీ సైనికులపై కేసు మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి జాన్ కుసాక్ సైకలాజికల్ హర్రర్ ఫిల్మ్ '1408' సీక్వెల్‌లో నటాలియా డయ్యర్, ఎలిజా వుడ్ వైల్డ్ హార్స్ నైన్' లో పురుషుల సంబంధాలు, స్నేహం పరిమితులపై జాన్ మాల్కోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు జేమ్స్ బాండ్ 007 రేసులో రాబర్ట్ ప్యాటిన్సన్, నికోలస్ హౌల్ట్: తదుపరి ఏజెంట్‌గా ఎవరు నిలవనున్నారు? DLS పద్ధతిలో భారత్ విజయం.. 2-0 ఆధిక్యంలో గిల్ సేన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ లలిత కళాపరిషత్ సమీపంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.. ప్రజల విజ్ఞప్తికి తక్షణ స్పందన.. కాలువల శుభ్రత పనులు చేపట్టిన 21వ డివిజన్ కార్పొరేటర్ నర్రావుల వెంకట సాయి భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడు అరెస్ట్-నిందితులను రిమాండ్ కు తరలింపు-24 గంటల్లో కేసును చేదించిన భూపాలపల్లి పోలీసులు

ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు కోనేరు స్వచ్ఛంద సంస్థ ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ యాదవ్

Select Suryaa Now
ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు   కోనేరు స్వచ్ఛంద సంస్థ ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ యాదవ్

 

లింగాల:

లింగాల మండల పరిధిలోని వల్లభాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల మానాజీపేట గ్రామ శివారులో ప్రజలకు ప్రభుత్వ పథకాలపై కోనేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేరు స్వచ్ఛంద సంస్థ ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు కచ్చితంగా లేబర్ కార్డు కోసం 110 రూపాయలు మీసేవ సెంటర్లో చాలాను కట్టి అప్లై చేస్తే ఐదు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ లేబర్ కార్డు ఉంటుందన్నారు. ఈ కార్డు ద్వారా ఇన్సూరెన్స్ పొందిన భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందితే 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. అదేవిధంగా వివిధ రకాల ఈ శ్రమ కార్డ్ ఇన్సూరెన్సు కార్డులకు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో అర్హత కలిగిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి స్త్రీ మహిళలు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలు వివాహం చేసుకున్నట్లైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కి అర్హులని ప్రభుత్వం చెప్తుందన్నారు. అందుకు అర్హులు దరఖాస్తు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లక్ష 116 లు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అదేవిధంగా బ్యాంకులలో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ 20 రూపాయలు చెల్లిస్తే రెండు లక్షల ప్రమాద బీమా లభిస్తుందన్నారు. ఇటీవల విబిజిరామ్ జి పథకం కింద గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామంలో పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని ఉన్నారు. ఎవరు కూడా వలస వెళ్లకుండా స్థానికంగా ఉండి పనులు చేసుకుని జీవనం సాగించాలని అన్నారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చదివించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాల పై మీరు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అదేవిధంగా చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు.