పారిశ్రామిక వ్యర్థ జలాల లారీ ఢీకొని ఇద్దరు మృతి
శామీర్‌పేట, మేజర్ న్యూస్ : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగిశెట్టిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వ్యర్థ జలాలను తరలిస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంతో నాగిశెట్టిపల్లి పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.