BREAKING
బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ జోరు.. సీన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే? పేదల సొంతింట్లో దీపావళి వెలుగులు! మంత్రి పొన్నం ప్రభాకర్ భిక్షు యాదవును సన్మానించిన యాదవ సంఘం సభ్యులు జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థిని సాహితి రూ.12 లక్షలు కేటాయించిన పాఠశాల నిర్మాణంలో కాంట్రాక్టర్ కాలయాపన.. నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన అనుమతి లేకుండా బోర్లు వేస్తే చట్టపరమైన చర్యలు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్...ప్రైవేట్ వీడియోలపై సీరియస్ వార్నింగ్! ఫినోలెక్స్ కంపెనీ, ముకుల్ మాధవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసరాల పంపిణీ రేణిగుంట 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ బీడీ బాలాజీ ఘన విజయం! పారిశ్రామిక వ్యర్థ జలాల లారీ ఢీకొని ఇద్దరు మృతి అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలు కాబోయే భార్యతో తొలి ఫోటో వైరల్, డిసెంబర్ 10న పెళ్లి అనంతపురం జిల్లా స్థానిక పోరు: కూటమి హవా! పీఎం అజయ్ పథకం సర్వే ప్రారంభం

కొర్విచెడ్ ఘని పాఠశాలలో వెబ్ సినిమా షూటింగ్ సందడి

Select Suryaa Now
కొర్విచెడ్ ఘని పాఠశాలలో వెబ్ సినిమా షూటింగ్ సందడి

బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్ మండలంలోని కొర్విచెడ్ ఘని గ్రామ పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) ప్రాంగణం శుక్రవారం వెబ్ సినిమా షూటింగ్‌తో సందడిగా మారింది. ‘కలర్ టీవీ విద్యార్థి’ అనే వెబ్ సినిమా చిత్రీకరణ పాఠశాల ఆవరణలో నిర్వహించడంతో విద్యార్థులు, గ్రామస్తుల్లో ఆసక్తి నెలకొంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు షూటింగ్ కొనసాగగా, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు గ్రామస్తులు, విద్యార్థులకు చిత్రీకరణను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ విధానం, కెమెరా పనితీరు, చిత్రీకరణ ప్రక్రియ గురించి విద్యార్థులకు చిత్ర బృందం అవగాహన కల్పించింది. సాధారణంగా పాఠాలు నేర్చుకునే పాఠశాల ప్రాంగణంలో సినిమా షూటింగ్ జరగడంతో విద్యార్థులు ఉత్సాహంగా తిలకించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి వినూత్న కార్యక్రమం నిర్వహించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ షూటింగ్‌కు అవసరమైన సహకారం అందించి చిత్ర బృందాన్ని ప్రోత్సహించడంతో కార్యక్రమం విజయవంతంగా సాగింది.