పీఎం అజయ్ పథకం సర్వే ప్రారంభం
– మండలంలో మూడు గ్రామాల ఎంపిక
– ప్రతి కుటుంబం సర్వేలో పాల్గొనాలి: సర్పంచ్ మోహన్ గౌడ్
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ప్రధానమంత్రి అనుసూచిత జాతుల అభ్యుదయ యోజన (పీఎం అజయ్) పథకం కింద ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లి, మామిళ్లపల్లి, దాసర్లపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ పథకం అమలులో భాగంగా మామిళ్లపల్లి గ్రామంలో శనివారం సర్పంచ్ ముకురాల మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల బృందం సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కుటుంబం సర్వేలో తప్పనిసరిగా పాల్గొని, తమ పూర్తి వివరాలను అధికారులకు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సర్వేకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పానం సైదులు, పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ, హరిప్రసాద్, సురేష్, ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు.