BREAKING
ఫినోలెక్స్ కంపెనీ, ముకుల్ మాధవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసరాల పంపిణీ రేణిగుంట 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ బీడీ బాలాజీ ఘన విజయం! పారిశ్రామిక వ్యర్థ జలాల లారీ ఢీకొని ఇద్దరు మృతి అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలు కాబోయే భార్యతో తొలి ఫోటో వైరల్, డిసెంబర్ 10న పెళ్లి అనంతపురం జిల్లా స్థానిక పోరు: కూటమి హవా! పీఎం అజయ్ పథకం సర్వే ప్రారంభం కొర్విచెడ్ ఘని పాఠశాలలో వెబ్ సినిమా షూటింగ్ సందడి ఎండిన పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు..! ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభించిన సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ దీపాల వెలుగుల్లో సేవా స్ఫూర్తిని చాటనున్న ఎక్స్‌ప్లోరికా ‘రూపాలి సాయంత్రం’ నేషనల్ రోప్ స్కిప్పింగ్ విజేతలకు ఐవీవై చైర్మెన్ అభినందన ... సమయపాలన పాటించని ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది! దీపాల ఆకృతిలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. ఆకట్టుకున్న వేడుకలు

నేషనల్ రోప్ స్కిప్పింగ్ విజేతలకు ఐవీవై చైర్మెన్ అభినందన ...

Select Suryaa Now
నేషనల్ రోప్ స్కిప్పింగ్ విజేతలకు ఐవీవై చైర్మెన్ అభినందన ...

 సూర్య కరీంనగర్ : ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఇటీవల నిర్వహించిన ఇండియన్ రోప్ స్కిప్పింగ్ ఫెడరేషన్ (IRSF) నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో సీతారాంపూర్ ఐవీవై పాఠశాల విద్యార్థులు ఆరు పతకాలను సాధించి పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. డెహ్రాడూన్ ప్రయాణం నుంచి విద్యార్థులు తిరుగుపయనం  అనంతరం శుక్రవారం పాఠశాలలో చైర్మెన్ పసుల మహేష్ అభినందించారు.
రోప్ స్కిప్పింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు,
అండర్‌-17 విభాగంలో వి.సాయి తేజ కు స్పీడ్ స్ప్రింట్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం, సింగిల్ డబుల్ అండర్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. టీమ్ ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో పి.క్రుతిక్ కుమార్, ఎస్. శ్రేయాన్ష్ స్వర్ణ పతకాలు సాధించి జట్టు ప్రతిభను చాటారు.
రజత, కాంస్యాలతో ,
అండర్‌-10 విభాగంలో జి. త్రిషుల్ రెడ్డి సింగిల్ డబుల్ అండర్ ఈవెంట్‌లో రజత పతకం సాధించాడు. అలాగే అండర్‌-12 విభాగంలో శ్రేయాన్ పటేల్ స్పీడ్ స్ప్రింట్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పసుల మహేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో విద్యార్థులు పతకాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమని, వారి కృషి, పట్టుదలకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ విజయానికి విద్యార్థుల నిరంతర సాధన, క్రమశిక్షణతో పాటు పీఈటీ ఉపాధ్యాయుల  కృషి ఎంతో దోహదపడిందని  వారు పేర్కొన్నారు .
జాతీయ వేదికపై ఐవీవై విద్యార్థులు సాధించిన ఈ విజయంతో పాఠశాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.